స్మార్ట్ అండర్‌వేర్‌తో నడుమునొప్పి దూరం
నడుమునొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు అమెరికాలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు స్మార్ట్ అండర్‌వేర్‌ను రూపొందించారు. నైలాన్ కాన్వాస్, లైక్రా, పాలిస్టర్‌తో తయారైన ఈ అండర్వేర్ ధృడమైన పట్టీలతో వెనుక భాగంలో ఛాతిని, తొడలను కలిపి ఉంచుతుంది. దీన్ని ధరించి బరువుల్ని ఎత్తినపుడు 15-45 శాతం నొప్పిని తగ్గిస్తుందట.








