అక్కడ జల కాలాడితే గుండె జారి గల్లంతవుతుందేమో!
అమెరికాలోని హూస్టన్ నగరంలో నిర్మించిన 40 అంతస్తుల విలాసవంతమైన అపార్ట్మెంట్ ధైర్యవంతులకు సైతం పరీక్ష పెట్టేదిగా ఉంది. 40వ అంతస్తుపైన నిర్మించిన స్విమింగ్‌పూల్‌లో సాన్నం చేయాలంటే గుండె దిటవు చేసుకోవాల్సిందే. భవంతికి ఆనుకుని అంచున (ఎడ్జ్‌లో) 10 అడుగుల మేర బయటకు దీన్ని నిర్మించారు. ఇందుకు 8 అంగుళాల దళసరి అయిన ప్లెక్సిగ్లాస్ను ఉపయోగించారు. స్నానం చేస్తూ కిందికి చూస్తే కార్లు సైతం పిల్లలు ఆడుకునే బొమ్మల్లా కనిపిస్తుంటాయి. ఇక్కడ స్నానం చేస్తూ హూస్టన్ నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. ధైర్యం లేనివారు ఇదే అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తులో నిర్మించిన మరో స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడే అవకాశం ఉంది.













