న్యూ జెర్సీ ప్రేక్షకులను సమ్మోహితులని చేసిన TFAS వారి SPB 50 మరియు ఉగాది సంబరాలు
హేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను అమెరికా లో న్యూ జెర్సీ రాష్ట్రం లోని తెలుగు కళా సమితి (TFAS) వారు April 23 , 2017 న న్యూ జెర్సీ రాష్ట్రంలో TRENTON నగరంలోని Patriots Theater at War Memorial లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా TFAS వారు మరియు 8K Miles MEDIA వారితో సంయుంక్తంగా నిర్వహించిన యస్ పి బాలసుబ్రమణ్యం స్వర్ణోత్సవ సంగీత విభావరి (SPB 50) ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసాయి. ఈ సంగీత విభావరి లొ సుమారు 1800 మంది ప్రేక్షకులు పాల్గొని ఉగాది పండుగ వాతావరణాన్ని ఆహ్లాదంగా సృష్టించారు.
తెలుగు కళా సమితి TFAS President శ్రీ గురు ఆలంపల్లి గారు తన కార్యవర్గ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన చేసి స్వాగత పలుకులతో వేడుకలను ప్రారంభించారు.
వేద పండితులు శ్రీ హర్ష గారు చేసిన పంచాంగ శ్రవణం సభికుల ఆసక్తిని చూరగొన్నది.
TFAS Cultural Chair Person శ్రీమతి రేణు తాడేపల్లి గారి ఆధ్వర్యంలో జరిగిన న్యూ జెర్సీ తెలుగు బాల బాలికల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.
Little Musicians Academy , Chinna Jeeyar Asramam, Trimurthy Group , Nritya Madhavi School of Dance & Center for Kuchipudi Dance వారి ఆధ్వర్యం లొ న్యూ జెర్సీ తెలుగు బాల బాలికలు చేసిన సంగీత, నృత్య, నాటికలు ప్రేక్షకుల మెప్పును పొందాయి.
TFAS Youth Volunteers అభినయించిన రూపకం ప్రేక్షకుల మెప్పును పొందింది.
శ్రీమతి ఉషా దరిసిపూడి గారు రచించి నటించిన హాస్య నాటకం WhatsApp అందరినీ నవ్వులతో ముంచెత్తింది. నాటకం లొ Vice President శ్రీ మధు అన్నా, ఉష, మరియు చిరంజీవి రిషిత పలికిన హస్య చలోక్తులతొ కూడిన సంభాషణలు, మన జీవితాల్లొ WhatsApp ప్రభావాన్ని చక్కగా ప్రతిబింబ చేసాయి. నటీనటులు పలికిన మాటలు అందరికీ కితకితలు పెట్టాయి.
అనంతరం శ్రీ యస్ పి బాలసుబ్రమణ్యం తన బృందం శ్రీమతి చిత్ర, శ్రీమతి యస్ పి శైలజ, శ్రీ యస్ పి చరణ్, శ్రీ హరీష్ రాఘవేంద్ర, శ్రీమతి స్వాగత, శ్రీమతి లత కృష్ణ మరియు శ్రీ అభిషేక్ చక్కటి క్రమ శిక్షణ తొ సమయం వృధా చెయకుండా సాగించిన సంగీత వీనుల విందు ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతగానో చూరగొన్నది.
బాలు గారు తన ఆర్కెష్ట్రా బృందం తొ అలపించిన మధుర గీతాలు సభికులను మంత్ర ముగ్ధులను చేసాయి. గాయనీగాయకులు పాడుతున్న 4 గంటలపాటు ఏ ఒక్కరు కదలకుండా ఆలకించడం గమనార్హం మరియు ప్రత్యేకత.
TFAS Secretary శ్రీమతి శ్రీదేవి జాగర్లమూడి గారు, TFAS Vice President శ్రి మధు అన్నా గారు, TFAS treasurer శ్రీ రంగా మాదిసెట్టి గారు, TFAS IT Services Chair Person శ్రీ శ్రీనివాస్ భర్తవరపు గారు, TFAS Youth Services Chair Person శ్రీ అమ్ము విద్యాసాగర్ గారు, TFAS Membership Services Chair Person శ్రీ సత్య నేమాన గారు, TFAS Community Services Chair Person శ్రీమతి ఇందిర వంగల గారు అన్ని కార్యక్రమాలను పర్య వేక్షిస్తూ వేడుకలను దిగ్విజయం చేసారు.
TFAS ట్రస్టీలు అందరు కలిసి బాలు గారిని వారి ఇతర బృందాన్ని ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకల సందర్భంగా TFAS వారు నిర్వహించిన SPB50 Youth Singing Competition లొ గెలుపొందిన నవతరం చిరంజీవులు శృతి నండూరి, స్నేహ అనుమోలు మరియు శ్రీమాన్ కొమరగిరి లను శ్రీ బాలు గారు అభినందించి ఙ్ణాపికలతో సత్కరించారు.
TFAS వారు ఏర్పాటు చేసిన ఈ SPB 50 సంగీత విభావరి కి అన్ని ఇతర తెలుగు సంస్థల ప్రతినిధులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమానికి ప్రత్యేక వన్నె తెచ్చారు.
TFAS వారు మరియు 8K Miles వారు April 21న ఏర్పాటు చేసిన Meet & Greet సభ లో శ్రీ బాలు గారు ప్రతి ఒక్క ప్రత్యేక ఆహ్వానితులతొ Photos దిగి వారిని సంతోషపరిచారు.
TFAS SPB 50 కార్యక్రమం తొ Patriots Theater at War Memorial, TRENTON తో ఆనందంతొ పులకించి ఆనంద డోలికల్లో మునిగిపోయింది.
TFAS Secretary శ్రీమతి శ్రీదేవి జాగర్లమూడి గారు వందన సమర్పణ గావించారు.
అమెరికా మరియు భారత జాతీయ గీతాలతొ సభ ముగించారు.








