ట్రంప్ భార్యలా కనిపించడానికి పాట్లు … ఆరు ప్లాస్టిక్ సర్జరీలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియాలా కనిపించేందుకు 42 ఏళ్ల క్లాడియా అనే మహిళ ఏకంగా ఆరు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది. టెక్సాస్‌కు చెందిన ఆమెకు మెలానియా అంటే చాలా ఇష్టమట. ఆమెను చూసినప్పుడల్లా ఏదో తెలియని శక్తి వస్తుందని క్లాడియా చెబుతోంది. ఫ్రాంక్లిన్ రోజ్ అనే వైద్యుడు ఆమెకు సర్జరీలు చేశాడు. తన సర్జరీ ఫొటోలు, వీడియోలను క్లాడియా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో, అమెకు టెక్సాస్‌లో విపరీతమైన పాపులారిటీ పెరిగిపోయింది.








