న్యూయార్క్ రోడ్డు ప్రమాదం.. వరంగల్ యువకుడి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్ యువకుడు దుర్మరణం పాలయ్యారు. కరీమాబాద్ మేరుగువాడకు చెందిన చింతకింది జీవన(30) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని బంధువులు మంగళవారం తెలిపారు. ఎంబీఏ చదివిన జీవన్ ఐదేళ్లక్రితం అమెరికాకు వెళ్లి అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు. అయితే, రోడ్డు ప్రమాదంలో జీవన్ మృతి చెందాడనిహైదరాబాద్లో ఉంటున్న ఆయన అక్క రేణుకకు మంగళవారం సమాచారం అందింది. టెక్సాస్లోని ఆస్పత్రిలో జీవన్ మృతదేహాన్నిభద్రపర్చినట్లుగా తెలిసింది.













