నార్త్ కరోలీనాలో రోడ్డు ప్రమాదం-ప్రదీప్ దుర్మరణం
నార్త్‌కరోలీనాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు ప్రదీప్ దుర్మరణం చెందారు. భార్యతో కలిసి ప్రయాణిస్తుండగా మినీ బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రదీప్ అక్కడిక్కడే మృతిచెందారుభువనగిరికి చెందిన ప్రదీప్ ఎనిమిదేళ్ల కిందటే అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డారు. ఏడాది కిందటే భువనగరికే చెందిన అమ్మాయితో అతనికి వివాహమైంది. అనంతరం భార్యను కూడా అమెరికా తీసుకెళ్లాడు. తన పుట్టినరోజు వేడుకలు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ప్రదీప్ అనూహ్యంగా చనిపోయారు..








