TCAGT ఆధ్వర్యంలో మండలికి ఘనసన్మానం
బృహత్తర టొరంటో తెలుగు సాంస్కృతిక సంఘం (TCAGT) ఆధ్వర్యంలో ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను సోమవారం నాడు ఘనంగా సత్కరించారు. మండలి ప్రసంగిస్తూ కెనడా ప్రవాసులను కలుసుకోవడం ఆనందంగా ఉందని, తెలుగు సంస్కృతి-సాంప్రదాయల పరిరక్షణకు వారు చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రవాసులు ప్రముఖులు పాల్గొన్నారు.








