అట్లాంటాలో రేవంత్ రెడ్డి
అట్లాంటాకు బుధవారం తెలంగాణ తెలుగు దేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఆయనకు అన్నీచోట్లా అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక టీడిపి పార్టీల కార్యకర్తలు, అభిమానులు స్కైలాండ్ బిజినెస్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉండేందుకు కార్యకర్తలు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. అమెరికాలో ఉన్నా మాతృరాష్ట్రం కోసం తపించే ఎన్నారైల సేవలు విస్మరించలేమని చెప్పారు. ఈ కార్యక్రమంలో లావు అంజయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.













