డల్లాస్ లో సెప్టెంజర్ 30న మహా బతుకమ్మ
అమెరికాలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ (టీపీఏడీ) నిర్వహించనున్న బతుకమ్మ , దసరా సంబరాలకు భారీ మద్దతు లభించింది. డల్లాస్ పోర్టు వర్త్ కమ్యూనిటీ నేతలు, పలు జాతీయ, స్థానిక సంస్థలు వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన నిపు ణులు, వ్యక్తులు పూర్తి స్థాయిలో సంబరాల నిర్వహణలో మేము సైతం అంటూ ముందుకు కదిలారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ అధికారికంగా సంబరాలు జరిగే తేదీలను ప్రకటించింది. టెక్సాస్ లో ఫిస్కో డాక్టర్ పెప్పర్ అరీనాలో సెప్టెంబర్ 30, 2017న జరిగే మహా బతుకమ్మ , దసరా సంబరాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఆ రోజు అర్థరాత్రి వరకు జరిగే సంబరాలకు వచ్చే వారికి అనేక వసతి, సౌకర్యాలు కల్పించనున్నారు. డాక్టర్ పెప్పర్ అరీనాలో జరిగే ఉత్సవాలకు హాజరయ్యే కుటుంబాలకు భద్రతతో పాటు, వాతావరణ పరిస్థితులు అనుకూలించే చర్యలు తీసుకోనున్నారు. ఈ మహా సంబరాలకు 10 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశముంది.
దీనికి ముందు జరిగిన భారీ విందుకు టీపాడ్, డల్లాస్, పోర్టు వర్క్ తెలుగు సంఘం, వి విధ సంస్థల సభ్యులు, శ్రేయోభిలాషులు, ఔత్సాహికులు హాజరయ్యారు. గ్రాండ్ వెల్ కమ్ పార్టీకి హాజరైన వారికి అధ్యక్షుడు కరణ్ రెడ్డి అభినందించారు. ఈ పార్టీకి హాజరై తమ ప్రతిభను చూపిన కళాకారులు, ప్రఖ్యాతగాయకులు, నృత్యకారులు, ప్రముఖులను అభినందించడమే కాదు దీపాలను వెలిగించి వారిలో ఉత్సాహం రగిలించారు. దీపాలను వెలిగించిన వారిలో ఇంతకు ముందు పార్లమెంటు సభ్యులైన ఆత్మచరణ్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్ కొరసపాటి, కృష్ణా రెడ్డి (టాంటెక్స్ అధ్యక్షుడు) డాక్టర్ నరసింహా రెడ్డి ఉరిమిండి, శ్రీకాంత్ పోలవరపు తదితరులు ఉన్నారు.
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆప్ డల్లాస్ అధ్యక్షుడు కరణ్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను పరిచయం చేశారు. బతుకమ్మ, దసరా సంబరాలను వైభవంగా జరిపేందుకు సిద్దమైన కార్యదర్శి రమణ, లష్కర్, సహాయ కార్యదర్శి చంద్ర పోలీస్, ట్రెజరర్ లింగారెడ్డి అల్వ, సహాయ ట్రెజరర్ రవికాంత్ రూపకె. రోజా అడెపు, సతీస్ జనుముపల్లితో పాటు టీపాడ్ సమన్వయ కర్త మాధవి సుంకిరెడ్డి తదితరులను సభకు పరిచయం చేశారు.
2017 బతుకమ్మ, దసరా సంబరాల ప్రణాళిక డిజైన్ టీపాడ్ గవర్నింగ్ బాడీ సభ్యులు, శారద సింగిరెడ్డి, ఆత్మచరణ్ రెడ్డిలు ఆవిష్కరించారు.








