టెక్సాస్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాన్ ఆంటోనియో (టీఏజీఎస్ఏ) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టెక్సాస్ రాష్ట్రంలోని సాన్ ఆంటోనియో నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఏజీఎస్ఏ అధ్యక్షుడు సంగిశెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ నృత్యం ప్రవాస తెలంగాణవాసులను అలరించాయి. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమర వీరులకు జోహార్లు ఆర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిమిక్రీ ఆర్టాస్ట్ రమేశ్ తనదైన శైలిలో వివిధ కళాకారుల గాత్ర అనుకరణతో అందర్ని మెప్పించి శభాష్ అనిపించుకున్నారు. నూతన తన గాత్రంతో తెలంగాణ ఎన్నారైలతో ఉత్సాహాన్ని తీసుకురాగా, సాన్ ఆంటోనియోకు చెందిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతలను ఆకట్టుకున్నాయి. ఎన్నారై తెలంగాణ మహిళలు బోనలు ప్రదర్శించారు.








