పోర్ట్ ల్యాండ్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ఒరెగాన్ రాష్ట్రం‑లోని పోర్ట్‑ల్యాండ్‑లో తెలంగాణ డెవలప్‑మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పోర్ట్‑ల్యాండ్ చాప్టర్ ఛైర్మన్ శ్రీని అనుమాండ్ర జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ వేడుకలకి పోర్ట్‑ల్యాండ్ మెట్రో నగరాల నుంచి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తెలంగాణ ధూమ్ ధామ్ సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు పాల్గొని ఆటా,పాటలతో ప్రేక్షకులను అలరించారు.








