పోర్ట్ లాండ్ లో టిడిఎఫ్ వనభోజనాలు
పోర్ట్లాండ్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో రాలే పార్క్లో వనభోజనాల కార్యక్రమాన్ని జూలై 30వ తేదీన ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దాదాపు 450 మందికిపైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ ఆటలపోటీల్లో చిన్నారులు, పెద్దలు పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన ఆహ్వానితులకోసం ఫుడ్ కమిటీ ఆధ్వర్యంలో పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు.








