న్యూజెర్సిలో తెలంగాణ బిజెపి నాయకునికి ఘనస్వాగతం
న్యూజెర్సి వచ్చిన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తెలంగాణ నాయకుడు మదుసూధన్ రెడ్డి గోలికి అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకోసం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ఆయన వివరించడంతోపాటు రాజకీయ కారణాలతో తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో విలాస్ జంబుల, కృష్ణారెడ్డి అనుగుల, శ్రీకాంత్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, పార్తిబన్ వరదన్ తదితరులు పాల్గొన్నారు.








