టాటా సంగీత శిక్షణ
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ఆధ్వర్యంలో స్వరబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాలిఫోర్నియా బే ఏరియాలో జరిగే ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు సాగనుంది. జులై 17 నుంచి 21 వరకు జరిగే ఈ శిక్షణ కార్యక్రమానికి ఇండియన్ ఐడియల్ విన్నర్ రేవంత్‌తోపాటు సింగర్స్ మాళవిక, సాకేత్ కే. ఇతర ప్రముఖ సంగీత విద్వాంసులు, కళాకారులు హాజరుకానున్నారు.
సంగీతంలో గమకాలు, చమకాలు, పదనిసలు, రాగం, తానం, పల్లవి అంశాలే కాకుండా, శృతి, లయ ఎలా ఉండాలి. ఎంత వరకు పాడాలనే విషయాలపై కోచింగ్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా తెలుగు వారికి సంగీత పరిజ్ఞానాన్ని మరింత పెంచాలనే ఆలోచనతోనే ఈ పనిచేస్తున్నట్లు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ప్రకటించింది. క్లాసికల్ పాటలతో పాటు, అలనాటి సంగీత మధురాలను ఆలపించి, లోటు పాట్లను సంగీత కళాకారులకు నేర్పనున్నారు. భారతీయ సంగీత సాహిత్యం గురించి బాగా తెలిసిన ప్రముఖ సంగీత డైరెక్టర, మ్యూజిషియన్, కంపోజర్ ఆశీర్వాద్ లూక్ ఆధ్వర్యంలో ఈ సంగీత శిక్షణ కార్యక్రమం జరగనుంది.













