అప్ఘనిస్తాన్ శాస్త్రవేతలకు వీసా నిరాకరించిన అమెరికా
సరైన విద్యా వసతులు లేకపోయినప్పటికీ అప్ఘనిస్తాన్ బాలికలు రోబోటిక్స్ రంగంలో ప్రయోగాలు చేశారు. అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీలో పాల్గొనడానికి ఎన్నో నెలలపాటు కష్టపడి సిద్ధమయ్యారు. ఇతర దేశాల నుంచి రోబోటిక్ పరికరాలు తెచ్చుకోవటం సాధ్యం కాకపోయినా, నిరుత్సాహపడలేదు. సొంతంగా తయారుచేసిన వస్తువులతో రోబోలను రూపొందించారు. ఇక అమెరికా వెళ్లి అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీలో పాల్గొనటమే తరువాయి. ఇక్కడే వీరికి పెద్ద సమస్య ఎదురైంది. హెరత్ నగరంలో ఆరుగురు బాలికల బృందం వీసా దరఖాస్తులను అమెరికా తిరస్కరించింది. ఈ నెలలో వాషింగ్టన్లో అంతర్జాతీయ రోబోటిక్ పోటీలు జరగనున్నాయి. వీటిలో పాల్గొనటం కోసం వారెంతగానో శ్రమించారు. 500 మైళ్ల దూరం లోని కాబూల్‌కు చేరుకొని అమెరికా రాయబార కార్యాలయంలో వీసాల కోసం రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నారు. అన్నీ సవ్వంగా సాగుతున్నాయని అనుకునేలోపే వారికి ఊహించని సమస్య ఎదరైంది. తమ వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు వార్తవిని బాలికలు దిగ్బ్రాంతికి గురయ్యారు.








