ప్రశంసలందుకున్న టాటా సేవా కార్యక్రమాలు
అమెరికా కమ్యూనిటీకి సేవ చేయడంలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ముందుంటోంది. సంస్థ ప్రతిసారీ లానే వేసవిలో నిరు పేదలకు పౌష్టికాహారం, దుస్తుల పంపిణీ, బొమ్మలను అందించింది. జులై నుంచి డిసెంబర్ వరకు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ట్రై స్టేట్ బేకన్ ఆఫ్ ఇంక్ ప్రాంతంలో ఆహారం, దుస్తులు, బొమ్మలను ఉచితంగా పంచింది. న్యూజెర్సీలోని వేలాది మంది నిరాశ్రయులకు ఈ సేవలు అందించింది. ఈ అతి పెద్ద ఈ కార్యక్రమానికి టాటా సహాయ కార్యదర్శి డాక్టర్ దామోదరరెడ్డి మల్లాది నేతృత్వం వహించగా, ఆర్వీపీ ధన్ రాజ్ సిరి, సతీస్ మేకల, గంగాధర్, ప్రసాద్ కూనరపు, భాస్కర్ పిన్నా, వేణు ఎనుగాల సహకారాన్ని అందించారు.
ఈ సేవా కార్యక్రమాలపై టాటా అడ్వయిజర్ డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి మాట్లాడుతూ, ఈ సేవలు నిరంతరం కొనసాగడంతోపాటు ఇతర చోట్లకు కూడా విస్తరించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రతి సంస్థ శీతాకాలంలో ఆహారం పంపిణీ కార్యక్రమాలను చేస్తుంటాయి. కానీ వేసవిలో ఆహారం అందించడం చాలా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం. టాటా ఇలా అందించడం వల్ల మిగతా స్వచ్ఛంధ సంస్థల మీద పడే భారం తగ్గుతుందని ఆయన తెలిపారు.
సమ్మర్ పుడ్ డ్రైవ్ నిర్వహిస్తున్న అందుకు సహకరిస్తున్న బిఓడిస్, ఆర్వీపీస్, ఎస్సీస్, ఆర్సీలకు టాటా అధ్యక్షులు ఝాన్సీరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఏటా రెండు మూడు సార్లు ఇలా సమ్మర్ క్యాంప్ పెట్టేందుకు తన వంతుగా కృషి చేస్తున్న డాక్టర్ రమ మల్లాదిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. టాటా అధ్యక్షులుగా ఎంపికైన మహేందర్ ముసుగు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చిన వారు అభినందనీయులని చెప్పారు. ఆహారం పంపిణీకి కొరత ఏర్పడితే టాటా అక్కడకు వస్తుంది మీకు కావాల్సినవి అందిస్తుందని కూడా ఆయన హామి ఇచ్చారు. ఏడాదికి పది సార్లు ఆహారం పంపిణీ చేసేందుకు సిద్దమని ప్రకటించారు.
ఈ ట్రైట్ పుడ్ డ్రైవ్ నిర్వహిస్తున్న వారికి టాటా మాజీ కోశాధికారి గౌతమ్ గోలి అభినందనలు తెలిపారు. టాటా నుంచి నాకు సమాచారం రావడమే ఆలస్యం.. సేవలకు అవసరమైన అన్ని సహాయ, సహకారాఆలు అందించేందుకు సిద్దమని ప్రకటించారు.
ఆకలితో అలమటించే వారికి తమ వంతుగా సాయం చేసేందుకు టాటా ఇలాంటి కార్యక్రమం ఎంచుకోవడం మహాద్భుతమని న్యూజెర్సీలోని బేకన్ హోప్ ఇంక్ డైరెక్టర్ డార్లెన్ అభిప్రాయం వ్యక్తం?చేశారు. ఆకలితో ఉన్న మాకు అవసరమైన బీన్స్, రైస్, బంగాళదుంపలు, బ్రోకలీ, టోమాటోలు, పాస్తా బ్రెడ్ తో పాటు, ప్రోటీన్లు ఉన్న ఆహారం పుష్కలంగా అందిందని చెప్పారు. ఆహారమే కాదు, ద్విచక్ర వాహనాలు, బెడ్స్ గృహోపకరణాలు, దస్తులు, ఆట బొమ్మలను వారు అందిచారని చెప్పారు. మ రో ఆరు నెలల వరకు తమకు అవసరమైన ఆహారం, దుస్తులు వంటి అవసరాలు ఈ సాయంతో తీరిందని చెప్పారు బేకన్ హోప్ ఇంక్ డైరెక్టర్ డారె ్లన్.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘానికి చెందిన ధన్ రాజ్ సిరి, సతీస్ మేకల, గంగాధర్, స్వామి బోడిగా, శివారెడ్డి, ప్రసాద్ కునరపు, ఎన్ఎన్ రెడ్డి దొంతిరెడ్డి, భాస్కర్ పిన్నా, కవిత తాటికొండ, రమణ కొత్త అలేఖ్య ఇంద్రగంటి, శశి కసిర, వేను ఈనుగల, వంశీ గుళ్లపల్లి, అమర్ వెలమల తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.













