కేసీ చేకూరికి టాంటెక్స్ ఉగాది పురస్కారం
ఉత్తర అమెరికాలో తెలుగు భాషా సాహిత్యాల వ్యాప్తికి, వికాసానికి విశేషంగా కృషి చేస్తున్న సాహితీ వేత్త, విమర్శకుడు, సమావేశాల నిర్వాహకుడు డల్లాస్ వాసి కేసి చేకూరికి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఉగాది పురస్కారంను ప్రదానం చేసింది. ఉగాది వేడుకల్లో మెమెంటో ఇచ్చి సత్కరించింది. కేసీ చేకూరి మంచి వక్త కూడా. అవధానాల్లో వృచ్ఛకులుగా కూడా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. రేడియో వ్యాఖ్యాతగా తెలుగు భాషా సాహిత్యాలకు, సంస్కృతీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, తెలుగు మాండలికాలను, పద సంపదను, వాడుక భాషను, తెలుగు కళారూపాలను ప్రోత్సహించడంతోపాటు ఇక్కడ ఉన్న తెలుగు చిన్నారులకు మాతృబాషపై ఆసక్తి కలిగించేలా యువ తెలుగు రేడియో కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తానా మహాసభల ప్రత్యేక సంచికకు సంపాదకునిగా ఆయన వ్యవహరిస్తున్నారు.













