జూలై 8న టాంటెక్స్ సాహిత్యవేదిక వార్షికోత్సవం
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నిర్వహించే నెలనెలా తెలుగు వెన్నెల 10వ వార్షికోత్సవం జూలై 8న ఇర్వింగ్లోని ఇర్వింగ్ హైస్కూల్లో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సంగీత సాహిత్య నృత్య సమ్మేళనానికి అందరూ రావాలని వారు ఆహ్వానించారు. ఈ?కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండలి బుద్ధప్రసాద్, తిరుపతిలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీమతి వి. దుర్గాభవాని విశిష్ట అతిధిగా హాజరవుతున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాత్యాయని విద్మహే, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, దాసరి అమరేంద్ర, వాసిరెడ్డి నవీన్, డా. కందిమళ్ళ సాంబశివరావు, గొర్తి బ్రహ్మానందం వంటి హేమాహేమీలు ఈ?కార్యక్రమంలో పాల్గొంటున్నారు.













