రాజంపేటలో సతీష్వేమనకు ఘన సన్మానం
తానా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తరువాత రాజంపేటకు వచ్చిన సతీష్ వేమనకు ఆయన అభిమానులు పెద్దఎత్తున స్వాగతసత్కారాలను ఏర్పాటు చేశారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఉత్తర అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి, ఎంపిలు సిఎం. రమేష్, గరికపాటి మోహన్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సతీష్ వేమన గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు.








