డిట్రాయిట్ లో ‘తానా’ సంగీత విభావరి
డిట్రాయిట్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఇండియన్ ఐడల్ 9 రన్నరప్‌గా నిలిచిన గాయకుడు రోహిత్ పరిటాలతో సంగీత విభావరిని ఏర్పాటు చేసింది. రోహిత్‌తో సెల్ఫీ, ఇంటరాక్టివ్ సెషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. గాయని వసుధ కొమరగిరి కూడా రోహిత్‌తో కలిసి పాటలు పాడనున్నారు. సెయింట్తోమా సిరియాక్ కాథలిక్ చర్చ్‌లో ఈ కార్యక్రమం జరగనున్నది.








