డిట్రాయిట్ లో తానా – రోహిత్ సంగీత విభావరి హిట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సతీష్ వేమన కార్యవర్గం చేసిన తొలి కార్యక్రమం డిట్రాయిట్లో జరిగింది. డిట్రాయిట్లోని సెయింట్ తోమా చర్చిలోఇండియన్ ఐడల్ రన్నర్ రోహిత్ సంగీత విభావరిని తొలి కార్యక్రమంగా చేసింది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. శనివారం నాడు తొలి కార్యక్రమాన్ని నిర్వహించింది. తానా ప్రాంతీయ ప్రతినిధి సునీల్ పంత్ర సమన్వయపరిచిన తానా సంగీత విభావరిలో 2 గంటలకు పైగా స్థానిక యువతీయువకులు, బాలబాలికల ప్రదర్శనలతో అలరించారు. ఇండియన్ ఐడల్ రన్నర్ పరిటాల రోహిత్ బాలకృష్ణ జన్మదినం సందర్భంగా మరో గాయనీ వసుధతో కలిసి 2 గంటలకు పైగా తన గానలహరితో ప్రేక్షకులను మైమరిపించారు. తానా మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్, పెద్దిబోయిన జోగేశ్వరరావు, కొడాలి నరహరి, శృంగవరపు నిరంజన్, యార్లగడ్డ శివరాం, కిరణ్ దుగ్గిరాల తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమ విజయవంతానికి మాధవ కొమరగిరి, చిత్తలూరి శ్రీనివాస్, జలిగామ కృష్ణప్రసాద్, ధేనువుకొండ శ్రీనివాస్ సాయమందించారు. బాలయ్య జన్మదినం సందర్భంగా కేక్ కోసిన అనంతరం వేడుకలు ముగిశాయి.













