తానా చెస్ వర్క్‌షాప్ సక్సెస్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ వర్క్‌షాప్ విజయవంతమైంది. దాదాపు 40 మంది చిన్నారులు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి సంధ్య గోలి చిన్నారులకు చెస్ ఆటపై మెళకువలను తెలియజేశారు. తానా రీజినల్ కో ఆర్డినేటర్ నాగరాజు నలజుల ఈ వర్క్‌షాప్ విజయవంతానికి కృషి చేశారు. తానా నాయకులు రవి పొట్లూరి, ప్రసాద్ కున్నరపు, కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








