తానా రీజినల్ కాన్ఫరెన్స్ ఏర్పాట్లపై సమావేశం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫిలడెల్ఫియాలో నిర్వహించనున్న మిడ్ అట్లాంటిక్ రీజినల్ కాన్ఫరెన్స్‌కు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై మనం రెస్టారెంట్లో తానా నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తానా ట్రెజరర్ రవి పొట్లూరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రీజినల్ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలపై ఇందులో చర్చించారు. ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ జే తాళ్ళూరి, మిడ్ అట్లాంటిక్ రీజినల్ కో ఆర్టినేటర్ నాగరాజు నలజుల, సాంబయ్య కోటపాటి, హరినాథ్ బుంగతవుల, వంశీ వాసిరెడ్డి, విద్యాగారపాటితోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.













