‘తానా’ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేయండి
అమెరికాలో చదివే తెలుగు విద్యార్థుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్కాలర్ షిప్పులు అందిస్తోంది. 2017-18 ఏడాది గాను డిగ్రీ చదువుకునే విద్యార్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. చదువుకునే సామర్థ్యం ఉన్నా, ఆర్థిక స్థోమత లేని వారికి అందులోనూ అమెరికాలో విద్యాభ్యాసం చేసేందుకు దరఖాస్తులను పిలిచింది. మొత్తం ఏడు రకాలైన గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్పులను అందించనుంది తానా. తానా ఫౌండేషన్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్పుల పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి 2 వేల డాలర్లను అందించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఉంటున్న తెలుగువారు ఎవరైనా ఈ స్కాలర్ షిప్పులను పొందవచ్చు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులు ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.
సెమిస్టర్ ప్రకారం ఒక్కో సెమిస్టర్ కు 500 డాలర్ల చొప్పున నాలుగు సెమిస్టర్లకు వీటిని అందించనున్నారు. గతంలో విద్యార్థులు చదువుకున్న విద్యను విజయవంతంగా పూర్తి చేసిన వారు మాత్రమే తానా స్కాలర్ షిప్ అందుకునేందకు అర్హులు. అంతే కాదు నాలుగు యూత్ స్కాలర్ షిప్ లను అందించనుంది తానా. ఉత్తర అమెరికాలో హైస్కూలు విద్యను పూర్తి చేసుకొని కాలేజీ చదువులకు వెళ్లే విద్యార్థులకు నాలుగు రకాల యూత్ స్కాలర్ షిప్‌ల ను అందించనుంది తానా. ఒక్కోక్కరికి వెయ్యి డాలర్లను వారికి స్కాలర్ షిప్‌గా ఇవ్వనుంది. తానా షౌండేషన్ కు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
Niranjan Srungavarapu,
Chairman- Tana Foundation
248-342-6872
Chairman@tanafoundation.org













