హ్యూస్టన్ ప్రజలకు తానా సాయం
హరికేన్ల ధాటితో అల్లాడిపోతున్న హ్యూస్టన్ ప్రజలకు తానా అండగా నిలిచింది. రెండు వారాలుగా తానా వాలంటీర్లు ఆరు వేల మందికి తాగునీరు, భోజనం అందించారు. బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులు సమకూర్చి, వసతి కల్పించారు. పది ఇళ్లకు షీట్ రాక్ మార్పు, ఫర్నీచర్, డెబ్రి క్లీన్ వంటివి అందజేసింది. ఈ కార్యక్రమాల్లో తానా అధ్యక్షులు సతీష్ వేమన, కార్యదర్శి అంజయ్య చౌదరి లావు, బోర్డు చైర్మన్ చలపతి హ్యూస్టన్ తానా బృందం సభ్యులు, పద్మశ్రీ ముత్యాల, నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, ప్రసాద్ నల్లూరి, ప్రసాద్ గుమ్మడి, పూర్ణసుధాకర్ వేములపల్లి, సుధీర్ కోనేరు, చంద్ర శిరిగిరి, కిరణ్ మానుకొండ, ఆంజనేయులు కోనేరు, కనంబాబు ఇనంపూడి, శ్రీనివాస్ గొట్టిపాటి, నూతన్ పళ్ళా, అరుణ్ వేములపల్లి తదితరులు పాల్గొన్నారు.








