వాషింగ్టన్ లో ఏప్రిల్ 1న ధీమ్ తానా పోటీలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మే నెలలో నిర్వహించనున్న మహాసభలను పురస్కరించుకుని వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న ధీమ్ తానా పోటీలను వాషింగ్టన్ నగరంలో ఏప్రిల్ 1న నిర్వహిస్తున్నారు. యాష్బర్న్లోని స్టోన్ బ్రిడ్జ్ హైస్కూల్లో ఈ పోటీలు జరుగుతాయి. సోలో సింగింగ్, గ్రూపు డ్యాన్సింగ్, మిస్ తీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా విభాగంలో పోటీలను ఏర్పాటు చేశారు. ఇతర వివరాలకు జాని నిమ్మలపూడిని 302 897 9276లో సంప్రదించవచ్చు.







