తానా ప్రాంతీయ మహాసభపై చర్చించిన డిట్రాయిట్ తానా కార్యవర్గ సమావేశం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యవర్గ సమావేశం నోవైలోని సబర్బన్ ప్లేస్లో శనివారం ఉదయం కార్యదర్శి లావు అంజయ్య చౌదరి నేతృత్వంలో జరిగింది. ఈ ఏడాది సెప్టెంబరులో తానా నూతన కార్యవర్గ సభ్యులతో కలిసి క్రూయిజ్ పర్యటన, అక్టోబరులో ఫిలడెల్ఫియాలో తానా ప్రాంతీయ మహాసభ, డిసెంబరులో తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు, వచ్చే ఏడాది నుండి తానా ఫ్యామిలీ యూత్ క్రూయిజ్ పేరిట నిర్వహించతలపెట్టిన పలు కార్యక్రమాలకు సంబంధించిన తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ సమావేశంలో తానా అధ్యక్షుడు వేమన సతీష్, సహాయ కార్యదర్శి పొట్లూరి రవి, ప్రెసిడెంట్ ఎలక్ట్ తాళ్లూరి జయశేఖర్, బోర్డు చైర్మన్ కొండ్రుకుంట చలపతి, ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, మాజీ అధ్యక్షుడు డా.జంపాల చౌదరి, కార్యవర్గ ప్రతినిధులు వేమన మల్లిక్, విశ్వనాథ నాయునిపాటి, నాగరాజు నలజుల, సతీస్ వేమూరి, కోయా హరీష్, జగదీష్ ప్రభల ఎన్.ఆర్.సీ.నాయుడు హరీష్ కొలసాని, వినోజ్ చనుమోలు సుగన్ చాగర్లమూడి, సూరపనేని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.













