లాస్ ఏంజెలిస్ లో ‘తానా’ బ్యాగ్ ల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో లాస్‌ఏంజెలిస్‌లో స్కూల్ పిల్లలకు బ్యాగ్‌లను పంపిణీ చేశారు. రివర్సైడ్ కౌంటీ అవంత్ గార్డె కమ్యూనిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎందరో పాల్గొన్నారు. తానా లాస్ఏంజెలిస్ టీమ్ పాస్టర్ స్కూల్‌ను దత్తత తీసుకుని కావాల్సిన సౌకర్యాలను అందజేస్తోంది. ఇందులో భాగంగా స్కూల్ బ్యాగ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాయుడు కొత్తపల్లి సమక్షంలో లాస్ ఏంజెలిస్ సిటీ కో ఆర్డినేటర్ సురేష్ కందెపు, నందన్ పొట్లూరి, శ్రీనివాస్ పొపూరి, అనిల్ యార్లగడ్డ, ఈశ్వర్ అరిగె, చంద్రశేఖర్ పాలిబోయిన, శ్రీకాంత్ మోపర్తి తదితరులు ఈ బ్యాక్‌ప్యాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.













