ఫ్లోరిడాలో సహాయ శిబిరాలను ఏర్పాటు చేసిన తానా, ఆటా, టాటా
ఇర్మా తుఫాన్‌తో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఫ్లోరిడాలోని తెలుగువాళ్ళకు సహాయంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), అమెరికా తెలుగు సంఘం (ఆటా), ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా)తోపాటు ఇతర ఇండియన్ సంఘాలు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాయి.








