న్యూజెర్సిలో విజయవంతమైన ఎపి జన్మభూమి కార్యక్రమం
న్యూజెర్సిలో ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది. అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి, ఎపి గ్రామీణాభివృద్ధిశాఖ సంచాలకులు బి. సీతారామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయరామ్కోమటి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్నారైలు కూడా పాలుపంచుకుంటే త్వరితగతిన అభివృద్ధిని సాధించవచ్చన్న ఉద్దేశ్యంతో ఎపి జన్మభూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు.
ఈ సందర్భంగా సీతారామాంజనేయులు గ్రామీణాభివృద్ధిపై ఇచ్చిన ప్రజంటేషన్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. గ్రామీణాభివృద్ధితోపాటు పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటు, అంగన్వాడీ భవనాల నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధిలో తమవంతు సహాయాన్ని అందించేందుకు చాలామంది ఎన్నారైలు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తానా నాయకులు కూడా పాల్గొన్నారు. తానా రీజినల్ కో ఆర్డినేటర్ విద్యాగారపాటి మాట్లాడుతూ, జన్మభూమికి సేవ చేసేందుకు ఇది ఒక అవకాశమని చెప్పారు. బ్రహ్మాజీ వలివేటి చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం కూడా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ జే తాళ్ళూరి, విద్యాగారపాటి, లక్ష్మీ దేవినేనితోపాటు రాజా కసుకుర్తి, రత్న ముల్పూరి, శ్రీనివాస్ ఓరుగంటి, శ్రీచౌదరి, వంశీ వాసిరెడ్డి, రామకృష్ణ వాసిరెడ్డి, తులసీరామ్ కొడాలి తదితరులతోపాటు జన్మభూమి కో ఆర్డినేటర్ శ్రీరామ్ అలోకం ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.








