క్లీవ్‌లాండ్‌లో ఘనంగా జరిగిన తానా 5కె రన్
ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో సెప్టెంబర్ 17వ తేదీన తానా, తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన 5 కె రన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు తానా నాయకులు పాల్గొన్నారు. సునీల్పాంత్ర, అశోక్‌బాబు కొల్లా, రవిచంద్ర వడ్లమూడి, సుభాకర్ వెలగ, జో పెద్దిబోయిన, నిరంజన్ శృంగవరపు , జగదీష్ ప్రభల తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆరోరా మేయర్ రావడం విశేషం.








