కాన్సాస్లో గౌరీపూజ
కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సన్ సిటీ ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలను నిర్వహించింది. ఒలేతాలోని హెరిటేజ్ పార్క్లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 600 తెలుగువారు పాల్గొని సంప్రదాయబద్దంగా పండుగ జరుపుకున్నారు. వివిధరకాల పూలతో ఎంతో చక్కగా బతుకమ్మలను తయారుచేసి, చక్కని సాంప్రదాయిన్న ప్రతిబింబిచే ఉయ్యాల పాటలతో ఆడి, పాడి ఆనందించారు. కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా వచ్చిన అదితి బావరాజు ఉత్సాహంగా ఉయ్యాలపాటలు, గీతాలతో అందరినీ ఉత్సాహపరుస్తూ కార్యక్రమాన్ని నడిపించారు. గౌరీపూజతో ప్రారంభమై, బతుకమ్మ, ఉయ్యాల పాటలతో ఊపందుకొని, జమ్మిపూజ మరియు నిమజ్ఞనం బతుకమ్మ కార్యక్రమం సాగింది. ఆ తర్వాత చక్కని విందుభోజనం, అదితి పాటలు, పిల్లలు పెద్దల నృత్యాలతో అందరూ ఎంతో ఆనందించారు. టీఏజీకేసీ అధ్యక్షురాలు దుర్గ తెల్లా అన్ని బతుకమ్మలలో చక్కగా చేసిన 3 బతుకమ్మలు చేసినవారికి బహుమతులు ఇచ్చి, కార్యక్రమానికి సాయపడిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా)కి, దాతలకు మరియు విజయవంతం కావడానికి కృషి చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు.













