TAGC Volunteering Community and Social Services
చికాగో మహా నగర తెలుగు సంస్థ, టిఏజిసి (TAGC) ఆధ్వర్యంలో యూత్ కమిటీ విభాగం మరో మహత్తర కార్యం చేపట్టింది. ఇక్కడి స్థానిక సాంబర్గ్ లోని ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ (FMSC) లో తమ సభ్యులతో కలిసి టిఏజిసి (TAGC) బోర్డు మెంబెర్స్, యూత్ కమిటీ మెంబెర్స్ స్వచ్చంద సేవ లో పాల్గొన్నారు. ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ ప్రపంచం నలుమూలలా ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు ఉచితంగా ఆహారం అందిస్తుంది. ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆసియ లోని పలు దేశాలలో ఈ సంస్థ సేవలు అందిస్తుంది.
టిఏజిసి (TAGC) ప్రతి ఏట ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక ఎన్నో స్వచ్చంద సేవ కార్యక్రమాలు చేపడుతుంది. వాటిలో భాగంగా ఈ సంవత్సరము ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థకు చేయూతను అందించింది. పలు దేశాలకు పంపవలసిన ఆహారాన్ని ప్యాకెట్ల లో పోసి సీల్ చేసేందుకు తరుచు వాలంటీర్ల సహాయం కోరుతుంది. ఈ రోజు టిఏజిసి (TAGC) తరఫున 45 వాలంటీర్స్ ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ కు చెందిన సాంబర్గ్, నైపర్విల్ బ్రాంచి ల లో ఆహారం ప్యాక్ చేయడం లో సహాయ పడ్డారు. రెండు గంటల సమయం లో 202 బాక్సుల ఆహారాన్ని ప్యాక్ చేసారు ఈ ప్యాకెట్స్ ద్వారా 43632 భోజనాలు, 119 చిన్నారులకు ఒక సంవత్సరము సరిపోతుంది.
ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ (FMSC) ప్రపంచం లో 70 దేశాలలో స్వచ్చంద సంస్థల ద్వారా సరైన పౌష్ఠిక ఆహారం అందని పిల్లలకు ఆహారం అందిస్తుంది. ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ (FMSC ) సంస్థ కు ఒక ప్యాకెట్ ఆహారం అందించడం లో 22 సెంట్స్ ఖర్చు అవుతుంది. తమకు వచ్చిన విరాళాల్లో 92 % ఆహారం పై ఖర్చు చేస్తాం అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సంస్థ తన కార్యక్రమాలు ఎటువంటి ప్రభుత్వ సహాయం లేకుండా దాతల ద్వారా వచ్చే డబ్బుల తోనే చేపడుతుంది.
ఈ సందర్బంగా టిఏజిసి (TAGC) అధ్యక్షులు రామచంద్రా రెడ్డి, ఏడే గారు, యూత్ కమిటీ చైర్ సాయి గొంగాటి మరియు కోశాధికారి వెంకట్ గూనుగంటి, ఆహారం ప్యాక్ చేయడానికి వచ్చిన చిన్నారులకు అభినందనలతో ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాబోయే అయిదు వారాలలో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలను రూపొందిసున్నము అని విన్నవించారు.













