టాకో సంగీత విభావరి సక్సెస్
ఒహాయోలోని మెక్రాయ్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్, న్యూ ఆల్బనీ ఒహాయో వారి ఆధ్వర్యంలో సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (టాకో) వార జూలై 3వ తేదీన నిర్వహించిన మ్యూజికల్ నైట్ ఘనంగా జరిగింది. ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్ ప్రధాన ఆకర్షణగా జరిగిన సంగీత విభావరిలో గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, గాయని సునీత, గాయకులు దినకర్, యాసిన్, నజీర్ పాల్గొని పాటలను ఆలపించారు. ఇతర గాయనీమణులు సమీరా, భార్గవి పిల్లై కూడా తమదైన శైలిలో పాటలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. మిమిక్రీ రమేశ్ చేసిన మిమిక్రీ అందరినీ ఆహ్లాదపరిచాయి.
నాట్స్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో టాకో ప్రెసిడెంట్ మన్నె నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లు వంగూరి రవి, పూదోట జ్యోతి, చలసాని జగన్నాథ్, కండ్రు ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మునగాల శ్రీకాంత్, ట్రెజరర్ బత్తుల వేణు, కల్చరల్ కో -ఆర్డినేటర్ సువరపు ప్రతిమ, వెబ్ కో -ఆర్డినేటర్ వెంకట కనక, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ కాశీచైనుల సుబ్రహ్మణ్యం, కొసకె వినోద్, పుడ్ కో-ఆర్డినేటర్ కనపర్తి హనుమాన్, కల్చరల్ అడ్వైజర్ పోలిన శ్రీనివాస్, టాకో ట్రస్టీలు పుట్టి మురళి, డెగ్గ రాధిక, వీగసేన శ్రీధర్ర్, సతీశ్ల సూచనల మేర జరిగింది. కార్యక్రమానికి నాట్స్ కొలంబస్ సభ్యులు పూదోట సురేశ్, కేసాని శ్రీధర్, బోడెపూడి కోటేశ్వరరావు, ఫణిభూషణ్, చలసాని జగన్నాథ్, కుప్పా నవ్వలు హాజరయ్యారు. మ్యూజికల్ నైట్ను విజయవంతంగా జరగడానికి కృషి చేసిన గాయనీగాయకులకు, ఆర్కెస్ట్రా బృందానికి, నాట్స్ నేషనల్ టీంకు టాకో ప్రెసిడెంట్ నాగేశ్వరరావు మన్నె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.













