సుష్మాస్వరాజ్ కు అరుదైన గౌరవం
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే ఆమె మేటి రాజకీయ నేతగా అమెరికా వర్ణించింది. అమెరికాలోని ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లోని వెలువరించిన వ్యాసంలో భారతదేశంలోనే అత్యుత్తమంగా ప్రేమించదగిన రాజకీయ నేత సుష్వా స్వరాజ్ అంటూ ఆ మేగజిన్ అభివర్ణించింది. టుంకూ వరదరాజన్ అనే వ్యక్తి ఈ వ్యాసాన్ని వెలువరించారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయుల సమస్యలను పరిష్కరించేందుకు నిర్విరామంగా అలసిపోకుండా తన బాధ్యతల మేరకు పనిచేస్తున్న నేత సుష్మాస్వరాజ్. అందుకే ఆమె భారతదేశంలోనే అత్యుత్తమ ప్రేమించదగిన నాయకురాలు అని వరదరాజన్ పేర్కొన్నారు. ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా విధులు నిర్వరిస్తున్నారు.













