గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరో రికార్డు
ప్రముఖ సెర్చి ఇంజీన్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (44) అందిన పరిహారం ఎంత పెరిగిందో తెలుసా? అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న అమెరికా టాప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్స్ లిస్ట్‌లో చేరిన పిచాయ్ 200 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ సొంతం చేసుకొని మరోసారి రికార్డు సృష్టించారు. గూగుల్ మాతృసంస్థ అల్భాబెట్ సుందర్‌కు 200 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్ యూనిట్లను ఆయనకిచ్చింది. వీటి విలువ రూపాయల్లో సుమారు 12,855 కోట్లకు చేరింది. 2015 స్టాక్ అవార్డు సుమారు 99.8 మిలియన్ డాలర్లకు ఇది రెట్టింపు.













