లాస్ ఏంజెలిస్ లో సుజనాచౌదరి
కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రి సుజనాచౌదరి ఆదివారంనాడు లాస్ఏంజెలిస్లో పర్యటించినప్పుడు ఆయనకు తెలుగుదేశం పార్టీ అభిమానులు, అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరాంకోమటి, ఇతరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన లాస్ఏంజెలిస్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.








