అమెరికాలో చదవాలంటే ఏటా అనుమతి కోరాల్సిందే!
అమెరికాలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చేరిన భారత విద్యార్థులు ఆ దేశంలో ఉండేందుకు అనుమతి కోసం ప్రతి ఏటా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జాతీయ భద్రతను మరింతగా కట్టుదిట్టం చేసే ఓ ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం ఆమోదిస్తే భారతీయులతోపాటు విదేశీ విద్యార్థులకు ఈ ఇక్కటు తప్పవు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం అంతర్గత భద్రత విభాగంలో పరిశీలనలో ఉంది. ఇప్పటికైతే ప్రాథమిక దశలోనే ఉన్న ఈ ప్రతిపాదన అమలయ్యేందుకు మరో 18 నెలల సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు మారే సందర్భంలోనూ అక్కడ నివాసం ఉండేందుకు పునదరఖాస్తు చేసుకోవాల్సి అవసరం ఉండే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. నిర్దిష్ట కాల్యవధిలోగా కోర్సును పూర్తిచేసుకోకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగానూ కోరే అవకాశం ఉంది.













