తల్లి గర్భంలోనే భాష నేర్చుకుంటాం
తల్లి గర్భంలో ఉన్నపుడే అభిమన్యుడు పద్మవ్యూహం గురించి నేర్చుకున్నాడన్నది పుక్కిటి పురాణం కాదేమో. ఎందుకంటే తల్లి గర్భంలో ఉండగానే శిశువు భాష నేర్చుకోవడం ప్రారంభిస్తాడని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కన్సాస్ పరిశోధకులు అంటున్నారు. శిశువులు పుట్టేకంటే ముందు నెలలో మనం ఏవేమి రెండు భాషలు మాట్లాడినపుడు తేడాను గమనిస్తారట. బయట మనం మాట్లాడుకునే మాటల్ని, ధ్వనిని వింటారు. అలా వేర్వేరు ధ్వనిని విన్నపుడు శిశువు హృదయ స్పందన వేర్వేరుగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మాగ్నెటోకార్డియోగ్రామ్ (ఎమ్సీజీ)ను ఉపయోగించి 24 మంది నిండు గర్భిణులను పరీక్షించామని తెలిపారు.













