కుంగుబాటుకు జన్యు వైవిధ్యమే కారణమా?
మనుషుల్లోని జన్యు వైవిధ్యం కుంగుబాటుకు కారణమవుతోందని ఓ పరిశోధన చెబుతోంది. అపొలిపొప్రోటీన్-ఈ4 (ఏపీఒఈ4) అనే జన్వువు ఉన్న వ్యక్తులు, అది లేని వ్యక్తులతో పోలిస్తే కుంగుబాటుకు గురయ్యే అవకాశాలు 20శాతం ఎక్కువగా ఉన్నాయని అమెరికా పరిశోధకులు గుర్తించారు. 53 నుంచి 71 ఏళ్ల మధ్య వయసున్న 3,203 మంది వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి ఈ నిర్థారణకు వచ్చారు. వీరిలో ఏపీఓఈ4 ఉన్న వ్యక్తుల్లో వయసు పెరిగేకొద్దీ కుంగుబాటు లక్షణాలు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. జన్యువులను మార్చలేకపోయినా, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడమనేది వ్యక్తుల చేతుల్లోనే ఉంటుందని వీరు సూచిస్తున్నారు.








