నా ఆటోగ్రాఫ్ ను అమ్ముకుంటారా! ఇకపై ఇవ్వను
స్టార్ వార్స్ సీరీస్‌తో హాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జార్జ్ ల్యూకాస్ తన అభిమానులపై మండిపడ్డారు. ఇందుకు కారణం లేకపోలేదు. ల్యూకాస్ ఆటోగ్రాఫ్‌ను కొందరు 200 డాలర్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న విషయం ఆయనకు తెలిసింది. ఈ నేపథ్యంలో లాస్ ఏంజెలిస్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ నేను మీలా ఆటోగ్రాఫ్‌లు తీసుకుని వాటిని అమ్ముకుంటూ సమయం వృథా చేయలేదు. నా సమయాన్ని సినిమాలు తీస్తూ గడిపాను. అందుకే ఈ రోజు నా వద్ద ఇంత ఆస్తి ఉంది. సినిమా రంగంలోకి రాక ముందు నా చేతిలో నయాపైసా లేదు. ఇలా, నా ఆటోగ్రాఫ్‌లు అమ్ముకుని సొమ్ము చేసుకునే బదులు కష్టపడి సంపాదించుకోండి. ఈసారి ఎవ్వరికీ ఆటోగ్రాఫ్ ఇవ్వను అని తెలిపారు.













