మిస్ టీన్ యూనివర్స్గా సృష్టికౌర్
ఢిల్లీకి చెందిన సృష్టికౌర్ మిస్ టీన్ యూనివర్స్ 2017గా ఎంపికయింది. దక్షిణ అమెరికా దేశమైన నికరాగువాలోని మనాగువాలో నిర్వహించిన వార్షిక అందాల పోటీలో ఆమె 25 మంది పోటీదారులను ఎదుర్కొని విజేతగా నిలిచింది. భారత జాతీయ పక్షి అయిన నెమలి చిహ్నంతో ఉన్న వస్త్రాలను ధరించినందుకు ఆమె బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ అవార్డును కూడా గెలుచుకుంది. 15 నుంచి 19 ఏండ్లు ఉన్న టీనేజీ అమ్మాయిలకు మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఈ వార్షిక అందాల పోటీలో మెక్సికోకు చెందిన త్రావా, కెనడాకు చెందిన సమంతా పియెర్రే తర్వాతి స్థానాల్లో నిలిచారు. నోయిడాలోని లోటస్ ర్యాలీ ఇంటర్నేషనల్లో చదివిన సృష్టి ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్లో అభ్యసిస్తున్నది. ఆమె ఈ ఏడాది ప్రారంభంలో 29 మంది పోటీదారులను ఓడించి మిస్ టీన్ తియారా ఇంటర్నేషనల్ టైటిల్ను కూడా గెలుచుకుంది.













