న్యూయార్క్లో ఘనంగా టిఎల్ సిఏ వార్షిక క్రీడలు

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం అధ్యక్షులు శ్రీ గూడూరు శ్రీనివాస్, 2017 వార్షిక క్రీడలను ఈ నెల 30 వ తేదీన న్యూయార్కు నగరంలో ప్రారంభించారు. సారస్వత మరియు సాంస్కృతిక కార్యక్రమాలే కాక, క్రీడల పట్ల కూడా తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం శ్రద్ధ చూపుతూ ప్రతి సంవత్సరం ఈ క్రీడలని నిర్వహిస్తోంది అన్నారు. వైస్ ప్రెసిడెంట్ తాపీ ధర్మరావు గారు ఈ క్రీడలు తెలుగు జాతీయ సంఘాలు, TANA, NATS, NATA మరియ T.A.T.A. తో సంయుక్తంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సెక్రటరీ అశోక్ చింతకుంట సభ్యులంతా క్రీడా స్ఫూర్తి తో ఆటలు ఆడాలని చెప్పారు. NATA రీజినల్ వైస్ ప్రెసిడెంట్లు, ఉదయ్ దొమ్మరాజు, అశోక్ అట్టాడ సభ్యులు మురళి మెట్టల, T.A.T.A. న్యూ యార్కు రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సహోదర పెద్దిరెడ్డి, విమెన్ కో-చైర్ మాధవి సోలేటి, రీజినల్ కోఆర్డినేటర్లు యోగి వనమా మరియు పవన్ రవ్వ క్రీడల పట్ల ఈ ఐదు సంఘాలు చేస్తున్న కృషిని వివరించారు.
2017 క్రీడోత్సవాల ఈ మొదటి వారంలో ఇండోర్ గేమ్స్ ఐన బాడ్మింటన్, కారంస్, చెస్ మరియు టేబుల్ టెన్నిస్ తో దిగ్విజయంగా ప్రారంభించారు. దాదాపు 100 మందికి పైగా క్రీడాకారులు వివిధ రంగాలలో పోటీ పడ్డారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో నిర్వహించిన ఈ క్రీడలు న్యూ యార్కు తెలుగు వారందరినీ ఏకీకృతం చేయడమే కాకుండా వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తుంది అని ప్రేక్షకులు సంఘాలను అభినందించారు.
వచ్చే కొద్ది వారాలలో టెన్నిస్, రాకెట్ బాల్, మరియు క్రికెట్ ఆటల పోటీలు నిర్వహిస్తామని TLCA క్రీడల ముఖ్య నిర్వాహకులు సురేష్ బాబు తమ్మినేని మరియు సలహాదారులు జయప్రకాశ్ ఎంజపురి మరియు అశోక్ చింతకుంట తెలియజేశారు. ఈ క్రీడలకు పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకరులని ఉత్తేజపరచాలని కోరారు.
TLCA ధర్మకర్తల మండలి చైర్మన్ డా. రాఘవరావు పోలవరపు, vice చైర్మన్ డా. పూర్ణ అట్లూరి, వారి సతీమణి శుభ మరియు BOT సభ్యులు రావు వోలేటి గార్లు ప్రత్యేక అతిథులుగా విచ్చేసారు. కోశాధికారి బాబు కుదరవల్లి, EC సభ్యులు ప్రసాద్ కోయి క్రీడాకారుల రిజిస్ట్రేషన్ మరియు క్రీడల నిర్వహణ లో సహకారం అందించారు. కార్య నిర్వాహక సభ్యులు రమా వనమా, నెహ్రు కటారులు సహకారం అందించారు.











































































