కెరీర్ అనలిటిక్స్ పై మిల్పిటాస్ లో ప్రత్యేక కార్యక్రమం
అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి, ఎపి పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ రామాంజనేయులు సమక్షంలో కెరీర్ అనలిటిక్స్‌లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం గురించి కెరీర్ అనలిటిక్స్ డైరెక్టర్ కొత్తపల్లి ఉప్పాజీ మాట్లాడారు. మిల్పిటాస్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప్పాజీతోపాటు సంస్థ డైరెక్టర్ గోకుల్ రాచిరాజు కూడా మాట్లాడారు. కెరీర్ అనలిటిక్స్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా చేయదలచిన కార్యక్రమాలను సత్వరమే ప్రారంభించేలా చూడాలని రామాంజనేయులు సూచించారు. దీనిపై ఉప్పాజీ స్పందిస్తూ, వెంటనే ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తానని తెలిపారు. ఈ విషయమై తాము ఆంధ్రప్రదేశ్ స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రతినిధి శ్రీమతి లక్ష్మీతో మాట్లాడినట్లు కూడా చెప్పారు. ఈ కార్యక్రమానికి తాము జయరాంకోమటి నుంచి ప్రేరణ పొందినట్లు చెబుతూ, ఈ ఆశయసాధనలో జయరాంగారిని తమకు మార్గనిర్దేశం చేయాలని కోరుతూ బోర్డ్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పైలా ప్రసాద్, ప్రత్తిపాటి వీరబాబు కూడా పాల్గొన్నారు.













