హ్యూస్టన్ మహా నగరంలో SPB50
గాన గంధర్వుడు ”పద్మ భూషణ్” డా. ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం ఒక మహా మనీషి. 35 వత్సరాల క్రితం మొదటి సారి వచ్చిన నాటి నుంచీ ఈ నాటికీ హ్యూస్టన్ వాసులందరికీ ఎంతో ఆత్మీయుడు. వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ హిమాలయాలంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉంటే మహోన్నతుడు మన బాలూ.
ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అని అందరినీ “భ్రమింప” చేసినా, అక్షరాలా మన తెలుగు వాడైన SPB అనబడేబాలూ 50 ఏళ్ల సినీ సంగీత ప్రస్థానాన్ని యావత్ ప్రపంచం “SPB 50” పేరిట ఆ స్వర్ణోత్సవాలని జరుపుకుంటోంది. ఉత్తరఅమెరికాలో అతి కొద్ది నగరాలకే పరిమితమైన ఈ అపురూప, చారిత్రాత్మక SPB 50 గాన విభావరి వేడుకలు మన హ్యూస్టన్ మహా నగరంలో జరగడం కేవలం మన అదృష్టం.
ఏప్రిల్ 8, 2017 (శనివారం) నాడు సాయంత్రం 7 గంటల నుండీ University of Houston Main Campus (Cullen Hall) లో జరిగే ఈ స్వర్ణోత్సవ గాన విభావరిలో ఎన్నో అపురూపమైన పాటలు ఎస్..పి. బాల సుబ్రహ్మణ్యం గారు మనకి పాడివినిపిస్తారు. పూర్తి ఆర్కెష్ట్రా తో సుప్రసిద్ద గాయనీ మణులు చిత్ర, ఎస్. పి శైలజ తదితరులూ తమ సహకారాన్ని అందిస్టారు.
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమ రూపశిల్పి, నిర్బహణ SPB తనయుడు, ప్రసిద్ద గాయకుడు ఎస్.పి. చరణ్ గారే.“మళ్ళీ మళ్ళీ రాని” ఇటువంటి అపురూపమైన సినీ సంగీత విభావరికి కుటుబ సమేతంగా వచ్చి, ఆనందించి, హ్యూస్టన్ కిఎంతో ఆత్మీయుడైన మన S.P. బాల సుబ్రమణ్యం గారి సినీ సంగీత స్వర్ణోత్సవాల సందర్భంగా “మెగా టెక్సస్” అభినందనలు తెలియజేయమని కోరుతున్నాం.
– రాం చెరువు
Tickets are available at Tickets@tickets2events.com













