త్వరలో దుస్తుల నుంచి విద్యుత్
విద్యుత్ ఉత్పత్తి చేసే తేలికపాటి దుస్తులు త్వరలోనే రానున్నాయి. సౌకర్యవంతంగా ఉండే ఇవి శరీర కదలికలనుంచి కరెంటును ఉత్పత్తి చేయనున్నాయి. ఫ్యాబ్రిక్‌ను సర్క్యూట్‌గా మార్చే కొత్త తరహా విధానానికి శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. మస్సాచుసెట్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించిన లోహరహిత, తేలికగా వంగే ఎలక్ట్రోడ్లతో ఇది సాధ్యమైంది. దువ్వెన, స్వెటర్ రుద్దడం వల్ల వచ్చినట్లే, రెండు ఎలక్ట్రోడ్ల మధ్య భిన్న పదార్థాపు సూక్ష్మపొరలు కదలించడం ద్వారా ఇందులో విద్యుత్ జనిస్తుంది. ఈ విదానాన్ని ట్రైబో ఎలక్ట్రిక్ చార్జింగ్ అంటారు. శరీరం కదలినప్పుడు ఎలక్ట్రోడ్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. కేవలం దుస్తుల నుంచి కరెంటు కోసమే కాదు. మున్నుందు రిమోట్ వ్వవస్థల ద్వారా ఆరోగ్యస్థితిని నేరుగా పర్యవేక్షించేందుకు ఈ ప్రక్రియ మరింత ఉపయోగపడనుంది అని శాస్త్రవేత్త త్రిషాఆండ్రూ చెప్పారు. ఆవిరి నిక్షేపణ పద్ధతిలో పాలిమార్ అల్లిక ద్వారా విద్యుదుత్పత్తి దుస్తులను తయారు చేసే ఈ విధానం (పెడోట్)లో మానవ వెంట్రుకలో పదోవంతు (500 నానో మీటర్ల ) పరిమాణంలో ఉండే అతిసూక్ష్మ ఎలక్ట్రిక్ పోగులను వినియోగించనున్నారు.













