బ్యాటరీ అక్కర్లేని సెల్‌ఫోన్
స్మార్ట్ఫోన్లు వచ్చాక అది ఇదీ అని లేదు అన్ని పనులూ ఇట్టే చులాగ్గా పూర్తిచేసే అవకాశం వచ్చింది. అయితే స్మార్ట్ఫోన్లతో వచ్చే ప్రధానమైన ఇబ్బంది బ్యాటరీ. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నా, బేజులో చార్జరో, పవర్ బ్యాంకో లేకుండా రోజు గడవదు. ఇకపై ఈ చిక్కులు ఉండవని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం చెబుతోంది. చార్జింగ్ కాదు కదా అసలు బ్యాటరీయే అక్కర్లేని సెల్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ బృందంలో భారత సంతతికి చెందిన శ్యాం గుల్లకోట కూడా ఉండడం విశేషం. ఈ వినూత్న సెల్‌ఫోన్ విద్యుత్ వినియోగం దాదాపు శూన్యం. కొద్దోగొప్పో అవసరమైన శక్తిని సెల్‌ఫోన్ తనకు తాను తయారుచేసుకుంటుంది. ఆ మాత్రం ఎనర్జీని రేడియో తరంగాల నుంచి గ్రహించేలా తీర్చిదిద్దారు. కాంతి తరంగాలనుంచి కూడా ఈ సెల్‌ఫోన్ శక్తిని గ్రహిస్తుందట.








