ఆమెరికాలో సంపూర్ణ సూర్య గ్రహణం
99 సంవత్సరాల తర్వాత ఆమెరికాలో సంపూర్ణ సూర్య గ్రహణం దర్శనమివ్వనుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పనిదినమైన ఆగస్టు 21న గ్రహణం వస్తుండటంతో ఉద్యోగులు ఈ దృశ్యాన్ని చూసే అవకాశం లేకుండా పోయింది. అయితే కొన్ని కార్యాలయాలు తమ ఉద్యోగులు గ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాయి. గ్రహణం సందర్భంగా ఏం చేయాలి? ఏం చేయకూడదో వివరిస్తూ పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రత్యేక మార్గదర్శకాలను ఇస్తున్నాయి. ఇక ‘ఎమర్సన్ ఎలక్టిక్స్’ కంపెనీ తమ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కళ్లద్దాలను అందిస్తోంది. తమ కంపెనీలో 1400 మంది ఉద్యోగులు ఉన్నారని.. వారు సూర్యగ్రహణ దృశ్యాలను చూడాలనుకుంటే సన్‌గ్లాసెస్ పొందొచ్చని కంపెనీ పేర్కొంది.








