నిద్రలేమి.. అల్జీమర్స్‌కు ముందస్తు హెచ్చరిక?
ఎలాంటి అనారోగ్యం లేకున్నా నిద్రపట్టడం లేదంటే, అది అల్జీమర్స్ రాకకు చిహ్నం కావొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్రించలేకపోవడం, పగటిపూట జోగడం తదితర లక్షణాలు అల్జీమర్స్ ముప్పును సూచిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మేడిసన్ పరిశోధకులు వివరించారు. నిద్రలేమి లేనివారికి వ్యాధి ప్రమాదం లేదని చెప్పలేమన్నారు. అల్జీమర్స్‌కు ఇదొక సూచన మాత్రమేనని, మిగతారికన్నా నిద్రలేమితో బాధపడేవారికి ముప్పు ఎక్కువన్నదే తమ ఉద్దేశమని సృష్టం చేశారు.








