తల్లి అయినా సెరెనా
టెన్నిస్ స్టార్ సెరెరా విలియమ్స్ ఇంట సందడి నెలకొంది. టెన్నిన్ నంబర్ వన్ ఛాంపియన్ అయిన సెరెనా విలియమ్స్ కాబోయే భర్త అలెక్సిస్ ఒహనియన్ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్ లోని ఓ మెడికల్ సెంటర్లో ఆమెకు పాప పుట్టిన్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బిడ్డ ఆరోగ్యవంతంగా ఉన్నట్లు వారు వెల్లడించారు. దీంతో టెన్నిస్ ఆటగాళ్లతో పాటు అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా సెరెనాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను సెరెనా గెలుచుకున్న సంగతి తెలిసిందే. సెరెనా ఇప్పటి వరకు 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ మాజీ నంబర్‌వన్ 2018లో తిరిగి టెన్నిస్ కోర్టులో అడుగుపెడుతుందని ఆమె కోచ్ తెలిపాడు.













